నేటి నుంచి జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలు

GNTR: చెరుకూరి లెనిన్ ఓల్గా మెమో రియల్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం నుంచి ఈనెల 24 వరకు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు ఏపీ ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. అండర్-10, అండర్-13 విభాగంలోని పోటీలను ఏఎన్‌యూలో, అండర్ 15 విభాగ పోటీలను వీవీఐటీలో ఏర్పాటు చేశారు.