రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ELR: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బిల్లనపల్లి గ్రామానికి చెందిన బందుల స్వామి(20) బైక్‌పై వస్తుండగా మీర్జాపురం గ్రామంలో లారీ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్వామి మృతిచెందగా పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.