పోలీస్ వాహనాల విడిభాగాలు వేలం: SP
శ్రీకాకుళం: జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సర్వీస్ వాహనాలకు సంబంధించి విడిభాగాలను ఈనెల 18న వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ KV మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటితోపాటు పాడైన కుట్టుమిషన్లు వుడ్ వర్క్‌కు సంబంధించిన మెటీరియల్ ఎచ్చెర్ల పోలీస్ ఆర్మ్డ్ రిజర్వు కార్యాలయం వద్ద ఉదయం10 గంటలకు జరుగుతుందన్నారు.