ఎలుగుబంటి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
NDL: అహోబిలం అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. చెరువు వద్ద చాకలిబండ సమీపంలో మేకలను మేపుతున్న కాపరి శ్రీరాములపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో శ్రీరాములకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.