జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అధికారుల పనితీరు, దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తదితర వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బంది పనితీరును తెలుసుకుంటునే అన్ని వార్డులు కలియతిరిగారు.