VIDEO: భారీ వర్షంతో జలమయమైన ఎంపీడీవో కార్యాలయం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు నిండి అలుగు పోస్తుంది. అలుగు నీరు ఇళ్లలోకి రావడంతో 13వ వార్డు వినాయక నగర్ కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీవో కార్యాలయం, పాలశీతలీకరణ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపంలోకి భారీగా వరద నీరు చేరడంతో సేవలు నిలిపేశారు. వరదనీటితో ఎంపీడీవో కార్యాలయం పూర్తిగా జలయం అయింది.