సమర్థవంతంగా ఆహార భద్రత కార్యక్రమాలు

NLG: పేదలు, విద్యార్థులు, గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు పౌష్టికాహార పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గురువారం జిల్లా పర్యటన అనంతరం దేవరకొండలో సమీక్షా సమావేశం నిర్వహించారు.