CM ఇంటి ముందు ధర్నా చేస్తాం: కవిత

CM ఇంటి ముందు ధర్నా చేస్తాం: కవిత

NLG: జిల్లా కేంద్రంలో జరిగిన 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'కృష్ణానది నీళ్లు, SLBC, డిండి పూర్తి చేయలేదు. సుంకిశాల ప్రమాదంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. మేఘా కంపెనీతో CM రేవంత్‌కు ఫెవికాల్ బంధమా? కృష్ణానది నీళ్లు తేవడంలో విఫలమైతే CM ఇంటి ముందు ధర్నా చేస్తాం' అని హెచ్చరించారు.