ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సె

ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సె

WNP: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. కంచిరావుపల్లికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి ఓ ట్రేడింగ్ యాప్‌లో రూ. 81 వేలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.