సాయి కుల్వంత్ హాల్‌లో సంగీత కచేరీ

సాయి కుల్వంత్ హాల్‌లో సంగీత కచేరీ

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ కె. వందన బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి కుల్వంత్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర రాశిఫలాలను వివరించారు.