విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న లీలాకృష్ణ
కోనసీమ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కాగా, 9వ రోజు మంగళవారం దుర్గాష్టమి పర్వదినాన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోవడం తన భాగ్యంగా భావిస్తున్నానన్నారు.