'YCP నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు'

అన్నమయ్య: మెడికల్ కళాశాల విషయంలో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి, YCP నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని TDP రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి Rj. వెంకటేష్ విమర్శించారు. ఇవాళ మదనపల్లె నందు పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పీ4 విధానం ద్వారా నిధుల కొరత అధిగమించి మెడికల్ కళాశాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.