బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

NLR: అన్నమయ్య జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కావలి నుంచి బెంగళూరుకు సూపర్ డీలక్స్ బస్సు బయల్దేరింది. రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులోకి రాగానే డ్రైవర్ రసూల్‌కు గుండెపోటు వచ్చింది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కానీ రసూల్ బస్సులోనే మృతిచెందాడు.