VIDEO: అకాల వర్షానికి నేలకొరిగిన జొన్న పంటలు

VIDEO: అకాల వర్షానికి నేలకొరిగిన జొన్న పంటలు

NZB: పిట్లం మండలంలో ఆదివారం కురిసిన అకాల వర్షం జొన్న రైతులకు కన్నీరు మిగిల్చింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందాల్సిన పంట అకస్మాత్తుగా కురిసిన వానకు నేలపాలైంది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలన్నారు.