'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం'

'సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం'

అన్నమయ్య: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని కోడూరు MLA అరవ శ్రీధర్ అన్నారు. పెనగలూరు మండలం ముద్రపల్లి గ్రామానికి చెందిన చప్పిడి శ్రీనివాసులుకు రూ.56,441 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా వరలక్ష్మి వారి ఇంటి వద్ద అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.