చిల్డ్రన్ పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం.. పాల్గొన్న కలెక్టర్

చిల్డ్రన్ పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం.. పాల్గొన్న కలెక్టర్

ASF: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్ చిల్డ్రన్ పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత స్వయంగా పాల్గొని పార్క్ పరిసరాల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ప్రజలు స్వచ్ఛతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలన్నారు.