VIDEO: బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
కోనసీమ: మామిడికుదురు(మం) పాసర్లపూడి వైనతేయి వారధి పైనుంచి యువతి దూకి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మహాశివరాత్రి కావడంతో భక్తులు గోదావరిలో స్నానాలు చేస్తుండగా బ్రిడ్జిపై నుంచి యువతి నదిలోకి దూకడాన్ని కొంతమంది గమనించారు. వెంటనే స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేయడంతో వారు ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.