హైవేపై ప్రమాదం.. అన్నదమ్ములకు గాయాలు
CTR: రొంపిచర్ల క్రాస్ సమీపంలో NH పై బైకు అదుపుతప్పి రుద్రవీర (15), శశి అనే అన్నదమ్ములు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం మేరకు... వీరిద్దరూ మామిడికాయలు కోసేందుకు వెళ్లారు. బైక్‌పై తిరిగి వస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన రుద్రవీరను పీలేరు ఆసుపత్రికి తరలించారు. వైద్యం కోసం తిరుపతికి తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు.