ఈనెల 25న కనిగిరిలో జాబ్ మేళా

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 25న జాబ్ మేళా జరగనున్నదని కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి తెలిపారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ఆమె మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 8 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని ఆమె అన్నారు. ఆసక్తిగల 18 నుంచి 30 ఏళ్లలోపు వయసుగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.