జిల్లాలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్
BHNG: జిల్లాల్లో గృహావసరాలకు ఎల్‌పీజీ సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.