జంగారెడ్డిగూడెంలో అగ్నిప్రమాదం

జంగారెడ్డిగూడెంలో అగ్నిప్రమాదం

ELR: జంగారెడ్డిగూడెంలోని స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం సమీపంలోని రెండు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.