ట్రినిటీ కళాశాలలో అగ్నిప్రమాదం
కరీంనగర్ నగర శివారులోని రేకుర్తి సమీపంలో గల ట్రినిటీ కళాశాలలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కళాశాల భవనంలోని నాలుగవ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.