BRS ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ కేసు నమోదు
TG: మాజీమంత్రి జగదీష్ రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు పలు సోషల్ మీడియా అకౌంట్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు FIR నమోదు చేశారు. BRS లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన వారితో పాటు, వాటిని ఫార్వార్డ్ చేసిన వారికి కూడా నోటీసులు పంపి త్వరలో అదుపులోకి తీసుకోనున్నారు.