VIDEO: చేనేత మగ్గంలో దూరిన త్రాచుపాము

E.G: అమలాపురం రూరల్ మండలం బండారులంకలో పాము హల్చల్ చేసింది. గ్రామంలోని నేతల అప్పలరాజుకు చెందిన చేనేత మగ్గంలో పాము దూరి భయభ్రాంతులకు గురిచేసింది. అప్పలరాజు వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్‌కు సమాచారం అందించడంతో అతను వచ్చి పామును చాకచక్యంగా బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.