వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు
ADB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు కలిసి జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ప్రజలు సరైన ధ్రువపత్రాలు లేక రూ.50 వేలకు మించి నగదు సరఫరా చేయద్దన్నారు. అవాంఛనీయ ఘటనలు, గొడవలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.