డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన అదనపు కలెక్టర్
JN: లింగాల ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ పార్టీల బయలుదేరే కౌంటర్లు, సామగ్రి పంపిణీ, రిసెప్షన్ డెస్కులు, భద్రత, త్రాగునీరు వంటి ఏర్పాట్లు సమగ్రంగా చూసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.