అక్రమ కట్టడాలను అడ్డుకున్న పంచాయతీ అధికారులు

భద్రాద్రి: బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్‌లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలపై కొంతమంది స్థానికులు అక్రమ కట్టడాలు నిర్మిస్తుండడంతో, విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ ఈఓతో పాటు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అక్రమ కట్టడాలను తొలగించారు. డ్రైనేజీలపై ఎవరైనా కట్టడాలు నిర్మిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.