VIDEO: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

VIDEO: హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లె(మం) దేవతానగర్ వద్ద గత నెల 25న ముగ్గురు వ్యక్తులపై కర్రలతో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఈ కేసులో భూపతి, నాగభూషణం, గౌతమ్ కుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.