ఆటో బోల్తా... అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలు

ఆటో బోల్తా... అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలు

GDWL: అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండల పరిధిలోని జాతీయ రహదారి- 44పై బోరవెల్లి స్టేజీ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఎర్రవల్లి గ్రామం నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఆటో టైర్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా, ప్రయాణిస్తున్న ముగ్గురు అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.