VIDEO: కొబ్బరికాయల ఆటో బోల్తా.. ఎగబడ్డ జనం

వరంగల్: వర్ధన్నపేట పట్టణ శివారు భవాని కుంట వద్ద మంగళవారం కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనం బోల్తా పడి డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు టాటా ఏసీ వాహనంలోని కొబ్బరి బోండాలు చెల్లాచెదురుగా రోడ్డుకు ఇరువైపులా పడడంతో..అటుగా వెళ్లే స్థానికులు వాటిని పట్టుకెళ్ళేందుకు ఎగబడ్డారు.