VIDEO: వంతెనపై వాహనాల రాకపోకలు ప్రారంభం
కృష్ణా: చిన్న అవుట్ పల్లి వద్ద జాతీయ రహదారి అనుసంధాన పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి-ఏలూరు వైపు వెళ్లే వాహనాల కోసం చిన్న అవుట్ పల్లి పైవంతెనను అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ప్రస్తుతం ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాల కోసం పనులు వేగంగా సాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే రెండు వైపులా రాకపోకలకు అనుమతించనున్నారు.