VIDEO: కుంట స్థలాల పరిరక్షణకు నివేదిక

ప్రకాశం: గిద్దలూరులోని కాశీనాయన కుంట స్థలం అక్రమాలకు గురవుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, సర్వేయర్‌తో కలిసి కుంట స్థలంను సర్వేచేసి సరిహద్దులు వేసినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలోనే నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించి, కుంట స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటదాసు తెలిపారు.