బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూపులు

బస్సుల కోసం ప్రయాణికులు ఎదురుచూపులు

VZM: కొత్తవలస నుంచి విశాఖకు వెళ్ళడానికి ఉదయం పూట బస్సుల కొరత అధికంగా ఉండడంతో ప్రయాణికులు బస్సుల కోసం బస్ స్టాప్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్తవలస నుంచి విశాఖ వెళ్ళడానికి ప్రధాన కేంద్రం కావడంతో ఉద్యోగుల సంఖ్య ఉదయంపూట ఎక్కువగా ఉంటుంది. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చినప్పటినుంచి మహిళ ప్రయాణికులు తీవ్రంగా పెరిగింది.