'అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకోవడం సరికాదు'
ప్రకాశం: మార్కాపురం మండలం దరిమడుగులో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం సరికాదని మార్కాపురం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. సోమవారం నిరసనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని AOకి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే శిలాఫలకాన్ని ఏర్పాటు చేశామని, టీడీపీ నేత ఆ స్థలంలోకి వెళ్ళనీయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు.