నట్టల నివారణతోనే జీవాలు సురక్షితం

నట్టల నివారణతోనే జీవాలు సురక్షితం

VKB: నట్టల నివారణతోనే జీవాలు సురక్షితమని కొడంగల్ పశువైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ నోహ తెలిపారు. కొడంగల్లో 567 గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందును వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవాలకు వ్యాధి సోకిన తర్వాత కాకుండా ముందే పశువైద్యాధికారుల సూచనలు పాటించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో పశువైద్య సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.