VIDEO: 100 ఏళ్ల ఆశ్రమానికి ఎంత కష్టమొచ్చిందో..!

VIDEO: 100 ఏళ్ల ఆశ్రమానికి ఎంత కష్టమొచ్చిందో..!

NLR: వందల ఏళ్ల చరిత్ర, స్వాతంత్ర కాంక్షకు వేదిక, మహాత్మా గాంధీ స్వయంగా అడుగుపెట్టిన భూమి అది. ఇందుకూరుపేట (M) పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నేడు పెన్నా నది ఉధృతికి ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. 15 ఏళ్లుగా పెన్నా నదిలో ఇసుక తవ్వకాలతో కోతకు గురై ఆశ్రమ భూములకు రక్షణ కరువైంది. పల్లెపాడు పరిసరాలలో ఇసుకరీచులు శాశ్వతంగా మూసివేసి రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.