VIDEO: అమరావతే శాశ్వత రాజధానిగా ఉండాలి: ఎమ్మెల్యే
E.G: సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ శనివారం తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానానికి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తమ పూర్తి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో రాజధానిని మార్చకుండా ఉండేందుకు చట్టపరమైన రక్షణ అవసరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు.