రేపే సర్కిల్ లెవెల్ వాలీబాల్ టోర్నీ

JGL: ధర్మపురి సర్కిల్ లెవెల్ వాలీబాల్ పోటీలను గురువారం నిర్వహించనున్నట్లు సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. ధర్మపురి సర్కిల్ పరిధిలోగల ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూర్, బుగ్గారం వాలీబాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు వెల్గటూర్ ZPHSలో ఈ టోర్నీ జరగనుందని ఆయన పేర్కొన్నారు.