పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయి
VKB: కొడంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కారణమని కొడంగల్ నియోజకవర్గ ఇంఛార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపాలిటీలో విజయం సాధించిన అభ్యర్థులను అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.