సరిహద్దు ప్రాంతంలో 10మంది మావోయిస్టులు అరెస్ట్

BDK: చర్ల సరిహద్దు ప్రాంతమైన సుక్మా జిల్లాలో పది మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారిలో ఒకరి తలపై రూ.లక్ష రివార్డు ఉందన్నారు. దులేద్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో వీరిని పట్టుకున్నట్లు సుక్మా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ వెల్లడించారు.