సర్పంచ్ బరిలో భార్యాభర్తలు
TG: యాదాద్రి జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. బీబీనగర్‌కు చెందిన మహేష్ ఏ పనిచేసినా జ్యోతిష్కుడిని సంప్రదిస్తుంటాడు. అయితే, సర్పంచ్‌గా పోటీ చేస్తానని మహేష్ ఆయనకు చెప్పగా.. 'నువ్వు తలపెట్టిన కార్యంలో నీ భార్య ఉంటే విజయం వరిస్తుంది' అని చెప్పాడు. దీంతో మహేష్, భార్య శ్రీలత నామినేషన్ వేశారు. బ్యాలెట్ పేపర్‌పై ఇద్దరి పేర్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు.