'పలాసను జిల్లాగా ప్రకటించాలి'
SKLM: పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు డిమాండ్‌కు అన్ని పార్టీ నాయకులు కలిసికట్టుగా సహకరించాలని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం టెక్కలిలోని ఆమె కార్యాలయంలో పలాస జిల్లా సాధన కమిటీతో సమావేశమై, పలాస జిల్లా ఏర్పడితే ఇచ్ఛాపురం నియోజకవర్గం ఎక్కువగా లాభపడుతుందని, అందరి సహకారం అవసరమని తెలిపారు. పలాసను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.