గాజు బాటిల్ పేలి మహిళకు గాయాలు
MNCL: కాసిపేట్ మండలం సోమగుడెంలో గాజు బాటిల్ పేలి మహిళకు గాయాలైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లు ధనలక్ష్మి ఇంట్లో చెత్త కాల్చుతుండగా అందులో ఉన్న గాజు సీసా పెలింది. ప్రమాదంలో ఆమె చేతి వేళ్లు ఊడిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.