VIDEO: మట్టి అక్రమ రవాణా.. టిప్పర్ సీజ్
WGL: పర్వతగిరి మండల పరిధిలో అక్రమ మట్టి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి ఎస్పై ప్రవీణ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కొంకపాక నుంచి వరంగల్ వైపు వెళ్తున్న అనుమతులు లేని మట్టి టిప్పర్‌ను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమ మట్టి, ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.