అయినవిల్లిలో 'స్వచ్ఛ రథం' ప్రారంభించిన ఎమ్మెల్యే

అయినవిల్లిలో 'స్వచ్ఛ రథం' ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వచ్ఛ రథాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఇంటింటికీ పొడి చెత్త సేకరించడానికి స్వచ్ఛ రథంను ప్రారంభించామన్నారు. ప్రతి గ్రామానికి వారం లో ఒక సారి ఈ రథం వస్తుందన్నారు. రథంలో అట్ట పెట్టెలు, ప్లాస్టిక్ బాటిల్స్, అల్యూమినియం వస్తువులు ఇస్తే నిత్యావసర వస్తువులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.