VIDEO: 'నల్లాలకు మోటర్లు ఏర్పాటు చేయవద్దు'

VIDEO: 'నల్లాలకు మోటర్లు ఏర్పాటు చేయవద్దు'

MDK: నల్లాలకు మోటర్లు ఏర్పాటు చేసి ఇతరులకు నీరు రాకుండా చేయవద్దని చిన్న శంకరంపేట మండలం మడూర్ సర్పంచ్ దివ్య లింగ గౌడ్ గ్రామస్తులను కోరారు. ఆదివారం గ్రామంలో పర్యటించి నీటి సరఫరా తీరును పరిశీలన చేసినట్లు తెలిపారు. నల్లాలకు మోటర్లు ఏర్పాటు చేస్తే తొలగించి గ్రామపంచాయతీలో పెడతామని హెచ్చరించారు. గ్రామస్తులు వేసవికాలంలో సహకరించాలని ఆమె కోరారు.