మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

ASR: మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరమని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని చింతపల్లి సీఐ ఎం. వినోద్ బాబు పిలుపునిచ్చారు. స్థానిక ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సై వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రమణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఈగల్' బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.