నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని భాగ్యనగర్ 4వ లైన్‌లో రహదారి విస్తరణలో భాగంగా విద్యుత్ స్తంభాలను పక్కకు జరపనున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్తు శాఖ డీఈ పాండు రంగారావు తెలిపారు. ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.