VIDEO: ములుగులో లోక్ అదాలత్ విజయవంతం
ములుగు జిల్లా కోర్టులో ననిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ ఈ రోజు తెలిపారు. ఈ సందర్భంగా 4బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.