VIDEO: తిరువూరులో ఉచిత మెగా వైద్య శిబిరం
కృష్ణా: కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరువూరులోని మధిర రోడ్డు ఆర్సీయం చర్చిలో 10,11 వార్డుల ప్రజల కోసం ఆదివారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు.